అసోం కరోనా కేసులు తక్కువగానే ఉన్నా సరే అక్కడి సర్కార్ మాత్రం కాస్త జాగ్రత్త పడుతుంది. ఎందుకు అయినా మంచిది అనే విధంగా చర్యలు తీసుకుంటు౦ది. కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో... వారాంతాల్లో రాష్ట్రమంతటా లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి హిమంత బిశ్వా శర్మ వెల్లడించారు. 

 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కామ్‌ రూప్ మెట్రోపాలిటన్ సిటీలో మరిన్ని జాగ్రత్తలు  తీసుకున్నామని ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో ఆదివారం నుంచి 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నామని ఆయన అన్నారు. ఇక ఆ రాష్ట్రంలో మరణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: