ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఉదయపురం గ్రామంలో మృతి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా​ నిర్ధరణ అయింది. అయితే మృతదేహాన్ని అధికారులు ప్రొక్లెయిన్​తో శ్మశానానికి తీసుకెళ్లడం వివాదస్పదమైంది.ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఉదయపురం గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 

 


శుక్రవారం ఒక వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందారు. కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి మృతదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా అక్కడికి చేరుకున్న మున్సిపల్ అధికారులు అంత్యక్రియల కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

 


వైద్య పరీక్షల్లో మృతునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.దీంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్​తో పాటు పలువురు అధికారులు అక్కడకు చేరుకుని మున్సిపాలిటీ జేసీబీ సహాయంతో మృతదేహాన్ని తరలించారు. ఆ ప్రాంతాన్ని కంటైన్​మెంట్ జోన్​గా ప్రకటించి... బంధువులు, కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: