నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం అంకిల్ పెంట నుంచి ఎడ్ల బండ్లపై అక్రమంగా తరలిస్తున్న కలపను అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కలప విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.నల్లమల అడవిలో స్మగ్లర్లు అక్రమంగా ఎడ్ల బండ్లపై నారవేప దుంగలను తరలిస్తుండగా... ఫారెస్ట్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. 

 

 

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం అంకిల్ పెంట నుంచి తరలిస్తున్న క్రమంలో అధికారులు ఈ దాడులు చేశారు.దుంగల విలువ దాదాపు రూ. 2 లక్షలు ఉంటుందని ఫారెస్ట్ రేంజర్ రవీందర్ నాయక్ తెలిపారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపిన రవీందర్​ నాయక్​... కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. అటవీ సంపదను కొల్లగొట్టిన వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీ సంపద స్మగ్లింగ్​ కాకుండా ప్రజలు తమకు సహకరించాలని కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: