ప్రవేట్ ల్యాబుల్లో కరోనా పరిక్షల విషయంలో తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు రేపు తెలంగాణాలోని ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా పరిక్షలకు బ్రేక్ వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా కరోనా పరిక్షలు చేస్తున్నాయి కొన్ని ల్యాబ్స్. ఇక ప్రజల నుంచి కూడా భారీగా వసూలు చేస్తున్నాయి అనే ఆరోపణలు వచ్చాయి. 

 

ఐసీఎంఆర్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి ఈ ల్యాబ్స్. దీనితో తెలంగాణా సర్కార్... కరోనా విషయంలో లాభాలు చూడవద్దు అని పేర్కొంది. ఇష్టం వచ్చినట్టు నమూనాలు సేకరించడం వాటిని పరిక్షించడం... ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కు అవుతున్నాయి అనే ఆరోపణలు రావడంతో ప్రభుత్వం పరిక్షలకు బ్రేక్ వేస్తూ నిర్ణయం వెల్లడించింది. హైదరాబాద్ లో దందా జరుగుతుంది అని కూడా కొందరు ఆరోపణలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: