దాసరి కుటుంబంలో వివాదం రోజు రోజుకి ముదురుతుంది. తన అన్న దాసరి ప్రభు చేసిన ఆరోపణలపై... దాసరి అరుణ్ కుమార్ స్పందించారు. కాసేపటి క్రితం అతను మాట్లాడారు. తమ మధ్య ఆస్తి వివాదాలు మినహా మరొకటి లేవని ఆయన అన్నారు. నా ఇంటికి నేను వెళ్తే తప్పు ఏంటీ అని ఆయన నిలదీశారు. 

 

పోలీసులు ముందు నేను ప్రభు ని కొడితే అప్పుడే అరెస్ట్ చేసే వాళ్ళు కదా అని ఆయన ప్రశ్నించారు. దాసరి ప్రభు చేసిన ఆరోపణలు అవాస్తవం అన్నారు. మా అన్నయ్య దగ్గర కోర్ట్ ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు. తాను పోలీసుల సమక్షంలోనే కొరియర్ తీసుకున్నాను అని అన్నారు. నా ఇంట్లో నేను గోడ దూకితే తప్పు ఏంటీ అని ఆయన ప్రశ్నించారు. ఆస్తి గొడవలు ప్రతీ ఇంట్లో ఉంటాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: