గత ఏడాది నుంచి తన అన్నయ్య డిప్రెషన్ లో ఉన్నాడు అని దాసరి అరుణ్ కుమార్ ఆరోపించారు. తన అన్న చేసిన విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభు ఉంటున్న ఇల్లు తనది కూడా అని ఆయన అన్నారు. నా ఇంటికి నేను వెళ్తే తప్పు ఏంటీ అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే తాను అక్కడికి వెళ్లాను అన్నారు. 

 

మా ఇద్దరి మధ్య ఏడాదిగా ఆస్తి గొడవలు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ ఇంటిపై కోర్ట్ ఆర్డర్ ఉందని, ఆ ఇంటిపై కోర్ట్ ఉత్తర్వులు మా అన్నయ్య దగ్గర ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు. గతంలో మోహన్ బాబు మురళీ మోహన్, సి కళ్యాణ్ స్పందించారు అని, కూర్చుని పరిష్కరించాల్సిన సమస్యను రోడ్డు మీదకు లాగారు అని ఆయన  మండిపడ్డారు. తాను తన తండ్రి గదికి వెళ్ళా అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: