దేశంలో కరోనా సునామి అసలు ఇప్పుడే మొదలు పెట్టిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకున్నా సరే ఆగే పరిస్థితి మాత్రం దాదాపుగా కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు వస్తున్న వార్తలు, నిపుణుల అంచనాల ప్రకారం చూస్తే ప్రతీ రోజు జులై మధ్య వారం నుంచి 30 వేల కేసులు దేశంలో నమోదు కావొచ్చని అంటున్నారు. 

 

మహారాష్ట్రలో ప్రతీ రోజు కూడా కనీసం 10 వేల కేసులు ఢిల్లీలో కూడా అదే స్థాయిలో ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీనితో కేంద్ర రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. అయితే లాక్ డౌన్ ని విధిస్తే ఎలా ఉంటుంది అనే దానిపై కూడా పలు రాష్ట్రాలు తర్జన భర్జన పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: