కొంతమంది పోలీసులు, అధికారులు నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాస్ అన్నారు. మీరు మీ పద్ధతులను మార్చుకోకపోతే, తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. కేంద్రం కన్నెర్ర చేస్తే, ఈ ముఖ్యమంత్రే ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదని ఆయన ఎద్దేవా చేసారు. అటువంటిది మీరు ఏమి చూసుకుని మా కార్యకర్తలపై తప్పుడు కేసులను పెడుతున్నారని నిలదీశారు. 

 

మిమ్మల్ని వదిలి పెట్టం... కోర్టు మెట్లను ఎక్కిస్తామని అన్నారు. రేపు వచ్చేది మా ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేసారు. ఉద్యోగాలను పోగొట్టుకొని, రోడ్లమీద తిరగవలసి వస్తుంది, గుర్తుపెట్టుకోండని ఆయన వ్యాఖ్యలు చేసారు. అహంకారంతో వ్యవహరించి మాపై తప్పుడు కేసులు పెట్టవద్దన్న ఆయన.. వెంటనే మీ పద్ధతులను మార్చుకోమని చెప్తున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: