లాక్డౌన్ అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం తెరుచుకున్న విషయం తెలిసిందే. రోజూ వేలాది మంది భక్తులు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు..
ఈ వైరస్ వ్యాధి నుంచి విముక్తి పొందాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. రంగనాయక మండపంలో వేద పండితులు సీఎం కి వేద ఆశీర్వచనం అందించారు. అంతేకాకుండా ఆలయ ఈవో సహా పలువురు సిబ్బంది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కి ప్రసాదాలు చిత్రపటం అందజేశారు.