వివేకా హత్యకేసు సీబీఐ దర్యాప్తుకివ్వాలని నాడు శవం పక్కన నిలబడి అడిగింది మీరు కాదా? అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ప్రభుత్వం దర్యాప్తు విషయంలో ఎందుకు వేగం ప్రదర్శించడం లేదు అని ఆయన ప్రశ్నించారు. గతేడాది మార్చి 15న జరిగిన వివేకానందరెడ్డి హత్య పురోగతి ఏమిటని ఆయన నిలదీశారు. 

 

గవర్నర్‌ని కలిసి మా బాబాయి హత్య కేసును సీబీఐకి ఇవ్వండని కోరింది మీరు కాదా జగన్ గారు? అని నిలదీశారు. సాక్ష్యాత్తు హైకోర్టులో పిటిషన్ వేసి వివేకా హత్య కేసు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించమని కోరింది మీరు కాదా జగన్ గారు ? అని ప్రశ్నల వర్ష౦ కురిపించారు. సిఎం అయిన తర్వాత ఈ ఏడాది పిబ్రవరి 20న మీరు వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు?  అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: