ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక బొగ్గు గనులు లేకపోవడంతో కేంద్రానికి రెండు వేల 500 కోట్ల వరకు ఏటా అదనంగా చెల్లించాల్సి వస్తుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం ఆరోపించారు. విభజన తర్వాత అసలు ఒక్క బొగ్గు గని కూడా ఏపీకి కేటాయించలేదు అని ఆయన ఆరోపించారు. అవినీతి తప్పుడు ఒప్పందాలతోనే ఏపీలో విద్యుత్ చార్జీలు ఈ విధంగా పెరిగాయి అని ఆయన మండిపడ్డారు. 

 

గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ప్రభుత్వంపై భారం పెంచాయి అని అన్నారు. గత ప్రభుత్వం తో పోలిస్తే ఏడాదికి విద్యుత్ రంగంలో దాదాపు 5 వేల కోట్ల వరకు ఆదా చేసామని ఆయన అన్నారు. గత ప్రభుత్వ అప్పులు కట్టడం కూడా విద్యుత్ చార్జీలపై భారం పెంచుతుందని అజయ్ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: