నంద్యాల ఎస్పీవై ఆగ్రోస్ లిమిటెడ్ కంపెనీ లోపల ఈ రోజు జరిగిన అమ్మోనియా గ్యాస్ లీక్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం కావడంతో భారీ నష్టం తప్పింది. ఈ లీకేజీ ఘటనపై జిల్లా కలెక్టర్ వీర పాండియన్ మాట్లాడారు.ఈ ఘటన పై జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి నేతృత్వంలో విచారణ కమిటీని నియమించామని ఆయన పేర్కొన్నారు. 

 

జిల్లా పరిశ్రమల శాఖ జిఎం నేతృత్వంలో ఎర్పాటు చేసిన కమిటీలో మెంబర్లుగా నంద్యాల ఆర్డీఓ, ఏపీఐఐసి జోనల్ మేనేజర్,  ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ కమీషనర్ ఆఫ్ లేబర్ అధికారులను నియమించామని ఆయన వివరించారు. గ్యాస్ లీకేజీ సంఘటన పై వెంటనే విచారణను ప్రారంభించి త్వరగా నివేదిక ఇవ్వాలని కమిటీ ని ఆదేశించామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: