మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఓ గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.నాలుగేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

 

 

 ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఓ గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 

 పోక్స్​ చట్టం కింద కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.లైంగిక దాడులపై ప్రజల్లో ఎంత అవగాహన తెచ్చిన వయసుతో సంబంధం లేకుండా మృగాళ్ల లాగా ఆడపిల్లల మీద వారి క్రూరత్వం చూపిస్తున్నారు. చట్టాలలో శిక్షలు ఎన్ని పెరిగిన మార్పు రావడంలేదు. కనీసం భయం కూడా లేకుండా ఇలాంటి ఘటనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: