భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి నేపధ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. “భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. సాహితీవేత్తగా, సామాజికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా బహుభాషా కోవిదుడిగా వారు చేసిన కృషి చిరస్మరణీయం. 

 

భారతీయ భాషల అభివృద్ధికోసం వారి తపన, ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండేలా తీసుకున్న చర్యలు, అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీ ఏర్పాటులో తీసుకున్న చొరవ ప్రశంసనీయం. వారి నిరాడంబర జీవితం ఆదర్శనీయం. ప్రతిష్టాత్మక ‘వేయిపడగలు’ నవలను హిందీలోకి అనువదించడమే కాకుండా.. పలు తెలుగు కవితాసంపుటాలను ఆంగ్లంలోకి అనువదించారు. తెలుగుదనానికి ప్రతీకైన శ్రీ పీవీ నరసింహారావు గారి స్మృత్యర్థం.. ఏడాదిపొడగునా వారి శతజయంతి ఉత్సవాలను జరపాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం.” అంటూ వెంకయ్య ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: