విశాఖ కనకమహాలక్ష్మి ఆలయంలో కరోనా కలకలం రేగింది. అనుబంధ పూజారికి కరోనా సోకింది. అతని తో పాటుగా మరో ముగ్గురికి కూడా కరోనా సోకింది. దీనితో నేడు రేపు ఆలయాన్ని అధికారులు మూసి వేసారు.  ఇక విశాఖలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అక్కడ కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. వ్యాపారులు కూడా ఇప్పుడు బయటకు రావాలి అంటే భయపడుతున్నారు. 

 

దీఇతో స్వచ్చందంగా కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ని అమలు చేసే పరిస్థితి ఉంది. ఇక విశాఖలో కరోనా కట్టడికి ప్రతీ ఇంటికి పరిక్షలు చెయ్యాలి అని భావిస్తున్నారు. దీనిపై అధికార యంత్రాంగం సిద్దమవుతుంది. ఇతర జిల్లాలతో పోలిస్తే కరోనా కేసులు అక్కడ తక్కువగానే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: