భారత్‌లో కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 19,906 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 410 మంది మరణించారు.  ఇప్పటివరకు మొత్తం 5,28,859కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,095కి పెరిగింది. 2,03,051 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,09,713 మంది కోలుకున్నారు. 

 

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో 12 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 169కి పెరిగింది. కొత్తగా 813 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

 

వారిలో 50 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కాగా, మరో 8 మంది విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చారు. తాజాగా 401 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,908 కాగా, మరో 7,021 మంది చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: