దేశంలోని ఐఐటీలు చేస్తున్న పరిశోధనలు దేశ ప్రజలకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. కొత్త ఆవిష్కరణలను ప్రజల ముంగిట తెస్తూ ఐఐటీలు ప్రజలకు సాయం చేస్తున్నాయి. ఐఐటి ముంబైకి చెందిన ప్రొఫెసర్ రింటి బెనర్జీ తయారు చేసిన కెమికల్ ద్వారా ఆటోమేటిక్ గా కరోనా అంతమవుతోంది. ఈ రసాయనం పూసిన బట్టల నుంచి తయారు చేసిన ముసుగులు, మాస్కులను ధరిస్తే 20 కన్నా ఎక్కువ సార్లు ఉతికిన తరువాత కూడా ఈ కెమికల్ ప్రభావం వాటిపై ఉంటుంది. 
 
గత మూడు నెలలుగా తీవ్రంగా శ్రమించి రింటీ ఈ కెమికల్ ను తయారు చేశారు. రసాయనాన్ని కరోనా వైరస్ కలిగివున్న వస్త్రంపై పూసిన వెంటనే వైరస్ కనుమరుగవుతుంది. ఈ రసాయనం శరీరంపై ఎలాంటి ప్రభావం చూపదని సౌత్‌ఇండియా టెక్స్‌టైల్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ పేర్కొంది. నోరు లేదా ముక్కు నుంచి విడుదలయ్యే డ్రాప్ లెట్స్ లో ఉన్న వైరస్ సైతం ఈ కెమికల్ ద్వారా చనిపోయినట్లు ఆయన చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: