దేశంలో ఫిబ్రవరి నుంచి కరోనా కేసులు మొదలయ్యాయి.. ఆ తర్వాత మార్చి దాని తీవ్రత పెరిగిపోవడంతో వైరస్ ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం.  అప్పటి నుంచి ప్రజలను సంరక్షించడానికి డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు ఎంతగానో సేవలు చేస్తున్నారు. ఈ మద్య లాక్ డౌన్ సడలించిన తర్వాత కేసులు మరింత పెరిగిపోతున్నాయి. ఇక మనల్ని రక్షించే వైద్యులకు, పోలీసులకు కరోనా కేసుల తాకిడి పెరిగింది.  ఇప్పటికే పలువురు వైద్యులు, పోలీసులు కరోనాతో కన్నుమూశారు. తాజాగా బెంగళూరు  ఓ కానిస్టేబుల్ కి కరోనా పాజిటీవ్ తేలింది. దాంతో బెంగళూరు పోలీస్ కమిషనర్ కార్యాలయ్యాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. 

 

యాంటీ టెర్రరిజమ్ సెల్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ కరోనా బారినపడటంతో అధికారులు రేపటి వరకూ కార్యాలయ్యాన్ని మూసివేయాలని నిర్ణయించారు. భవనాన్ని, దాని పరిసరాల్ని శానిటైజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. నగరంలో శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 16 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు.ఏసీబీ, క్రైం బ్రాంచ్, స్టేట్ రిజర్వ్ పోలీస్, హోం గార్డ్స్, సీఐడీ విభాగాల్లో వీరు విధులు నిర్వర్తిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: