కర్ణాటక రాజధాని బెంగళూరు లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.  రోజు రోజుకి అక్కడ కరోనా ఆందోళనకర స్థాయిలో ఉంటుంది. అక్కడి ప్రభుత్వం కూడా కీలక ప్రాంతాల్లో లాక్ డౌన్ ని అమలు చేస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు ఏకంగా పోలీస్ కమీషనర్ కార్యాలయంలోనే కరోనా కేసులు బయటపడ్డాయి. కరోనా దెబ్బకు బెంగళూరు పోలీస్ కమిషనర్ కార్యాలయ్యాన్ని తాత్కాలికంగా మూసి వేసారు. 

 

కార్యాలయంలోని యాంటీ టెర్రరిజమ్ సెల్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ కరోనా బారిన పడ్డారు. దీనితో రేపటి వరకు ఆఫీస్ మూసి వేసి సిబ్బందిని పంపించి... భవనాన్ని, దాని పరిసరాల్ని శానిటైజ్ చేస్తున్నారు. బెంగళూరు లో ఒక్క రోజే 16 మంది పోలీసులకు కరోనా వచ్చింది. ఇక మిగిలిన కమీషనర్ ఆఫీస్ లోనే పోలీసులు అందరికి కరోనా పరిక్షలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: