ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అక్రమాలపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో  విమర్శలు చేస్తున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. సరిహద్దు దాటుతున్న నాణ్యమైన ఇసుక అంటూ ఆయన ట్వీట్ చేసారు. 

 

లాక్ డౌన్ సమయంలో భారీగా అక్రమ ఇసుక తరలింపు ఆన్లైన్లో అందదు బ్లాక్ లో మాత్రం పుష్కలం అని ఆయన ఆరోపించారు. సామాన్యుడికి ఇసుకకష్టాలు అని మండిపడ్డారు. ప్రభుత్వ ఇసుకను ప్రభుత్వానికే అమ్మిన వైనం అని ఆయన ఎద్దేవా చేసారు. మీ పార్టీ ప్రజాప్రతినిధుల అక్రమఇసుక తవ్వకాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండని ఆయన సిఎం జగన్ ని ట్యాగ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: