హైదరాబాద్ లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి . కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర బృందాలు పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. కేసులు పెరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఎక్కడ ఎక్కడ అయితే కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయో ఆ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి  పెట్టి అక్కడి ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాయి. 

 

కరోనా కట్టడికి చర్యలు, అలాగే లాక్ డౌన్ అమలు తీరు, ఆస్పత్రుల్లో వైద్యం అందుతున్న తీరు అన్నింటిపై కూడా ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. గాంధీ ఆస్పత్రి వైద్యులతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. అలాగే తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖతో కూడా మాట్లాడి పరిస్థితిని కేంద్రానికి నివేదిక రూపంలో అందిస్తాయి కేంద్ర బృందాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: