కర్ణాటక రాజధాని బెంగళూరు లో కరోనా వైరస్ కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నా సరే కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అక్కడ పోలీసులకు కూడా కరోనా కంగారు పెడుతుంది. పోలీసులు కొందరు కరోనా బారిన పడ్డారు. 

 

ఇక పోలీసుల్లో మరణాలు కూడా నమోదు అవుతున్నాయి. బెంగళూరులో 57 ఏళ్ల అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ప్రాణాలు కోల్పోయారు. తన నివాసంలోని బాత్రూంలో పడిపోయి అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ ప్రాణాలు కోల్పోయారు అని అధికారులు వెల్లడించారు. ఇక ఆయన కుటుంబ సభ్యులు అందరిని అధికారులు క్వారంటైన్ చేసారు. ఇక నిన్న ఒక్క రోజే అక్కడ 16 మంది పోలీసులకు కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: