ఓ యువకుడు మైనార్​ బాలికపై అత్యాచారానికి పూనుకున్నాడు. విషయం తెలిసిన పెద్దలు నిలదీశారు. యువకుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు. గొడవ సద్దుమనిగిన తర్వాత ఆ యువకుడు మరో యువతితో ఓ ఇంట్లో చనువుగా ఉంటూ దొరికిపోయాడు. అది చూసిన మొదటి యువతి, స్థానికులు దేహశుద్ధి చేశారు.

 

 

నల్గొండ జిల్లా డిండి మండలం కాటికబండ తండాలో శివ అనే యువకుడుకి స్థానికులు దేహశుద్ధి చేశారు. శివ గతంలో అదే తండాకు చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. పెద్దల సమక్షంలో మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పడం వల్ల అప్పుడు గొడవ సద్దుమణిగింది.

 

తాజాగా శివ మరో యువతితో ఓ ఇంట్లో చనువుగా ఉన్నాడు. అది గమనించిన మొదటి యువతి, స్థానికులు అతనిని బయటకు లాగి దేహశుద్ధి చేశారు. చెట్టుకు కట్టేసి చితకబాదారు.

మరింత సమాచారం తెలుసుకోండి: