దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. స‌గ‌టున గ‌త రెండు రోజులుగా రోజుకు 20 వేల కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. రోజుకు స‌రాస‌రీ దేశం మొత్తం మీద 500 మంది చ‌నిపోతున్నార‌ను. ఇదిలా ఉంటే క‌రోనా రోగుల్లో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు ఉన్నాయ‌ని నిర్దారించారు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం కొత్త కోవిడ్ ల‌క్ష‌ణాల‌ను ప్ర‌క‌టించింది. 

 

మొత్తం 11 ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు క‌రోనా అనుమానితులుగా పేర్కొంది. ఈ 11 లక్షణాలను సీడీసీ తన అధికారిక జాబితాలో చేర్చింది. అధికారిక వెబ్‌సైట్‌లో కూడా వీటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఈ లక్షణాలు వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోపు కనిపిస్తాయని ఏపీ కొవిడ్ కంట్రోల్ రూమ్ పేర్కొంది.

 

కరోనా లక్షణాలు.. 
1- జ్వరం
2-  వణుకు
3-  దగ్గు
4- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
5- అలసట
6- ఒళ్లు నొప్పులు
7- తలనొప్పి
8-  రుచి చూడలేకపోవడం, వాసన పసిగట్టలేకపోవడం
9-  గొంతునొప్పి
10-  ముక్కు కారడం 
11- వికారం లేదా వాంతులు
12- డయేరియా

మరింత సమాచారం తెలుసుకోండి: