అస‌లే ఓ వైపు మ‌న దేశానికి క‌రోనా ప్ర‌మాదం ముంచు కొస్తోంది. గ‌త ప‌దిహేను రోజుల నుంచి దేశంలో క‌రోనా విళ‌య తాండ‌వం చేస్తోంది. ఇక గ‌త మూడు రోజులుగా స‌గ‌టు కేసులు రోజుకు ఏకంగా 20 వేల‌కు చేరుకుంటున్నాయి. ఇక రోజుకు దేశ వ్యాప్తంగా మ‌ర‌ణాలు కూడా స‌గ‌టున 500 వ‌ర‌కు ఉంటున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌న‌ల‌ను మ‌నం కాపాడుకు నేందుకు క‌రోనా వైర‌స్ మ‌నుష్యుల‌కు ఉందో తెలుసుకునేందుకు, జాగ్ర‌త్త‌లు తీసుకునేందుకు క‌రోనా ప‌రీక్ష‌లే కీల‌కం. 

 

ఓ వైపు కేసులు పెరుగుతోన్న వేళ ప‌రీక్ష‌లు పెంచకుండా త‌గ్గించ‌డంపై ప్ర‌జ‌ల్లో విస్మ‌యం వ్య‌క్తం అవుతోంది. ఆదివారంకు ముందు వ‌ర‌కు రోజుకు స‌గ‌టున 2.30 ల‌క్ష‌ల ప‌రీక్ష‌లు చేస్తే ఆదివారం మాత్రం కేవలం 1.70 ల‌క్ష‌ల ప‌రీక్ష‌లు మాత్ర‌మే నిర్వ‌హించారు. ఒక్క రోజే ఏకంగా 60 ల‌క్ష‌ల ప‌రీక్ష‌లు త‌గ్గిపోవ‌డం అటు కేసులు ఏకంగా 20 వేల‌కు చేరుకోవ‌డంతో ప్ర‌జల్లో ఎక్క‌డా లేని భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: