ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల కోసం 512 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెల విద్యుత్ ఫిక్సుడ్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు  తెలిపారు. 180 కోట్ల రూపాయల బకాయిలు మాఫీ చేసినట్టు సీఎం కీలక ప్రకటన చేశారు. గత నెలలో 550 కోట్ల రూపాయలు విడుదల చేసిన జగన్ ఈ నెలలో మిగిలిన బకాయిలు విడుదల చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 97 వేలకు పైగా పరిశ్రమలకు ... పది లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. 
 
సీఎం జగన్ మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పిన మాట్లను నిలబెట్టుకుందని... రెండో దశ రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా బకాయిలు విడుదల చేశామని చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటే మాత్రమే చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందని... ఈ పరిశ్రమల ద్వారా తక్కువ చదువు చదువుకున్న వాళ్లు కూడా ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: