ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల వ్యాపారులకు శుభవార్త చెప్పారు. తక్కువ వడ్డీకే 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలు అందించేలా ప్రణాళికను రూపొందింస్తున్నామని తెలిపారు. రెండో విడత బకాయిలు 512 కోట్ల రూపాయలు విడుదల చేసిన జగన్ వచ్చే ఏడాది 1000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తామని అన్నారు. పరిశ్రమలకు అండగా ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తుందని సీఎం తెలిపారు. 
 
ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన విద్యుత్ ఫిక్సుడ్ ఛార్జీలను మాఫీ చేస్తున్నట్టు సీఎం తెలిపారు. పరిశ్రమలకు అండగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల నుంచి 25 శాతం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 45 రోజుల్లోగా కొనుగోలు చేసిన ఉత్పత్తులకు సంబంధించిన నగదు జమ చేస్తామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: