తెలంగాణలో కరోనా రక్కసి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ భూతం కట్టలు తెంచుకుని విజృంభిస్తోంది.  కొత్త కేసుల రాకతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,419కి పెరిగింది. ప్రస్తుతం 9 వేల మంది చికిత్స పొందుతుండగా, 5,172 మంది డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఒక్కరోజే 244 మందిని డిశ్చార్జి చేశారు. ఇక, తెలంగాణలో తాజాగా 4 మరణాలు సంభవించాయి. దాంతో కరోనా మృతుల సంఖ్య 247కి పెరిగింది. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. జిల్లాలో కరోనాతో ఒకరి మృతి చెందారు.

 

బొంరాస్పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన చిక్కలి అనంతయ్య (65)కు కరోనా సోకడంతో 15 రోజుల నుంచి హైదరాబాద్ లోని గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.  ఈ నేపథ్యంలో అనంతయ్య తీవ్ర అస్వస్థతతో  మృతి చెందినట్లు సమాచారం వచ్చిందని మండల వైద్యాధికారి రవీంద్ర యాదవ్ తెలిపారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అవసరం ఉంటే  తప్ప ప్రజలు బయటకు రావొద్దని, మాస్క్, శానిటైజర్ తప్పక వాడాలని వైద్యులు సూచిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: