మహారాష్ట్ర‌లో కరోనా మరణ మృదంగం వాయిస్తుంది.  ఈ వైర‌స్ ధాటికి మ‌హారాష్ర్ట ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అవుతున్నారు. దేశంలో మార్చి నెల నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి డాక్టర్లు, పోలీసులు, పారిశుధ్ద్య కార్మికులు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎంతో ధైర్యం చేసిన విషయం తెలిసిందే. కానీ ఈ మద్య డాక్టర్లు, పోలీసులకు కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అంతే కాదు మరణాలు కూడా సంబవిస్తున్నాయి. తాజాగా  గ‌డిచిన 24 గంట‌ల్లో మ‌రో 77 మంది పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇద్ద‌రు పోలీసులు క‌రోనాతో చ‌నిపోయారు.

 

మహారాష్ట్ర పోలీసు విభాగంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,030కి చేరుకోగా, మృతుల సంఖ్య 59కి చేరింది. క‌రోనా విజృంభ‌ణ‌తో పోలీసులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 7,429 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో అత్య‌ధికంగా 75,539, థానేలో 34,257, పుణెలో 20,870, పాల్గ‌ర్ లో 5,267, ఔరంగాబాద్ లో 4,833 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. మ‌హారాష్ర్ట‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 1,64,626 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: