భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు ప‌ర‌స్ప‌రం దాడుల‌కు దిగారు. వాస్త‌వాధీన రేఖ వెంట‌ దాదాపు నెల రోజుల పైగా ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో ప‌రిస్థితులను చ‌క్క‌దిద్దేందుకు ఆర్మీ ఉన్న‌తాధికారుల చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో సైనికుల మ‌ధ్య అనూహ్యంగా హింసాత్మ‌క వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.


ఈ ఘ‌ట‌న త‌ర్వాత ఆర్మీ అధికారులు, దౌత్య చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. ఈ నేపథ్యంలో న్! భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల వేళ.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్తో ఫోన్లో సంభాషించనున్నట్లు సమాచారం.


తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న పరిస్థితులు చర్చకు వచ్చే అవకాశముందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: