ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఇప్పుడు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే  కరోనా ఆగడం లేదు. ఇక ఇప్పుడు రెండు రాష్ట్రాలు కూడా ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నాయి. కరోనా విషయంలో ఇప్పటి వరకు ఎవరికి వారుగా అన్నట్టు వ్యవహరించిన రాష్ట్రాలు... సరిహద్దుల్లో పరీక్షలను పెంచాలి అని భావిస్తున్నాయి. ఏపీ నుంచి తెలంగాణకు ఎవరు వెళ్ళినా, తెలంగాణా నుంచి ఎపీకి ఎవరు వెళ్ళినా సరే పరిక్షలు తప్పనిసరి చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. 

 

ఇప్ప‌టికే న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఏపీ నుంచి తెలంగాణ‌కు, తెలంగాణ నుంచి ఏపీకి వ‌చ్చే వారి విష‌యంలో నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేశారు. అదే విధంగా కరోనా కట్టడిలో కీలకమైన పరిక్షల విషయంలో ఏపీ సహకారం తీసుకోవాలి అని తెలంగాణా భావిస్తుంది. తెలంగాణా వారికి ప్రతీ రోజు 5 వేల పరిక్షల వరకు చేసే విధంగా ఏపీతో ఒప్పందం చేసుకునే ఆలోచనలో తెలంగాణా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో క‌రోనా క‌ట్ట‌డికి తెలంగాణ ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా ఆగేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: