హైదరాబాద్ లో కరోనా టెస్టులకు తాత్కాలిక బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇటీవలే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 50 వేల టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా పాత శాంపిల్ టెస్టింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు. దాంతో మూడు రోజులు పాటు కొత్త శాంపిల్స్ సేకరించకూడదని నిర్ణయించింది. పాత శాంపిల్స్ పూర్తి అయిన తర్వాతే కొత్త శాంపిల్స్ సేకరించాలని ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ పరీక్షలను ప్రైమరీ హెల్త్ సెంటర్లలోనూ భారీగా టెస్టింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.  గత కొన్ని రోజులుగా టెస్టుల సంఖ్య పెరగడంతో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కరోనా రోగుల సంఖ్య పెరిగిపోయింది.

 

తాజాగా హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు  పునఃప్రారంభించినట్లు సమాచారం.  సరోజిని కంటి ఆస్పత్రి, ప్రకృతి చికిత్సాలయంలో కరోనా పరీక్షలు ప్రారంభం. ఆయుర్వేదిక్, చార్మినార్ నిజామియా ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు మళ్లీ ప్రారంభించారు. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 250 చొప్పున నమూనాల సేకరణ.  కొండాపూర్, వనస్థలిపురం ప్రాంతీయ ఆసుపత్రి...బాలాపూర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌, మహేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నమూనాల సేకరిస్తున్నట్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: