నవంబర్ వరకు పేదలకు ఫ్రీ రేషన్ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. వన్ రేషన్ వన్ నేషన్ తో పేదలకు, వలస కార్మికులకు లబ్ది చేకూరుతుంది అని ప్రధాని పేర్కొన్నారు. వన్ నేషన్ వన్ రేషన్ అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. దేశంలో పేదలు ఎక్కడి నుంచి అయినా రేషన్ తీసుకోవచ్చు అని ఆయన ప్రకటించారు. రైతులు టాక్స్ పెయర్స్ కు ఈ పథకం క్రెడిట్ దక్కుతుంది అని మోడీ అన్నారు. 

 

కుటుంబంలో ప్రతీ ఒక్కరికి గోధుమలు లేదా బియ్యం 5 కేజీలు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కోసం లక్షా 50 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆయన వివరించారు. ప్రజలను వర్షా కాలంలో పస్తులు ఉంచేది లేదని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: