కొండపోచమ్మ సాగర్ కాలేశ్వరం సాగునీటి ప్రాజెక్టుల్లో నాణ్యతా లోపాలు  రోజుకొకటి  బయటపడుతున్నాయి అంటూ తాజాగా కాంగ్రెస్ నేత ఎంపీ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు, లక్ష కోట్లతో అద్భుతమైన ప్రాజెక్టు  నిర్మిస్తున్నామని చెప్పి.. నాణ్యత లేని ప్రాజెక్టు  నిర్మించారు అంటూ విమర్శించారు. కాళేశ్వరంలో ఎంతగానో అవినీతి జరిగిందని ఆరోపించారు, 

 

 కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు ఎంపీ రేవంత్ రెడ్డి. కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పడి  ఏకంగా గ్రామాల్లో సైతం మునిగిపోయిన నేపద్యంలో ఈ వ్యాఖ్యలు చేసారు  రేవంత్ రెడ్డి. కాలేశ్వరం ప్రారంభించి నెల  కూడా కాకముందే ఇప్పటికే ప్రధాన కాలువకు గండి పడడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: