తెలంగాణా కేబినేట్ సమావేశం రేపు జరిగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణా కేబినేట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాల్లో లాక్ డౌన్ కూడా ఒకటి అనే సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ని ఏ విధంగా అమలు చెయ్యాలి అనే దానిపై రేపు ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేస్తారు. ఇక సినిమా టీవీ సీరియల్ షూటింగ్ లను కూడా ఆపేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. 

 

సినిమా షూటింగ్ ల కారణంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తుంది. కరోనా కేసులు పెరిగే ఈ సమయంలో అనవసరంగా రిస్క్ వద్దు అని భావిస్తున్నారు. రేపు కేబినేట్ సమావేశంలో అసలు తీసుకునే నిర్ణయం ఏంటీ అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: