ఏపిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారు.  ప్రజలకు ఇచ్చిన హామీ ఒక్కొక్కటీ నెరవేరస్తూ వారి మన్ననలు పొందుతున్నారు. ఇప్పటికే పలు పథకాలు ప్రారంభించి ప్రజలకు చేరువయ్యేలా చేస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు కరోనా కష్టాలు ఉన్నా.. ప్రజలకు ఇచ్చిన హామీ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు సీఎం జగన్. తాజాగా  ప్రభుత్వ శాఖల్లో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకానికి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ కార్యకలాపాలను సీఎం జగన్‌ ఇవాళ అధికారికంగా ప్రారంభించనున్నారు.

 

ఉదయం 11 గంటలకు ఆప్కోస్‌ వెబ్‌సైట్‌ ఆరంభిస్తారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 47 వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకాల ధ్రువీకరణ పత్రాలను వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జారీ చేస్తారు. రాష్ట్ర సచివాలయంలో 26 ప్రభుత్వశాఖలకు సంబంధించి 643 మంది, విభాగాధిపతులు, కార్పొరేషన్లలో 10 వేల 707 మంది, 13 జిల్లా కలెక్టరేట్లలో 36 వేల 42 మందికి ప్లేస్‌మెంట్‌ ఇంటిమేషన్‌ లేఖలు విడుదల చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: