గత ప్రభుత్వంలో ఆస్పత్రులు ఎంత దారుణంగా ఉన్నాయి అనేది మనం అందరం చూసామని సిఎం జగన్ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లలను ఎలుకలు కోరికే పరిస్థితి ఉండేది అని ఆయన అన్నారు. యుకె తరహాలో గ్రామాల్లో వైద్య విప్లవం తీసుకొస్తామని ఆయన అన్నారు. 104, విలేజ్ క్లీనిక్, వీహెచ్ సి లను అనుసంధానం చేస్తామని అన్నారు. 

 

గతంలో సెల్ ఫోన్ లైట్ లతో వైద్యం అందించారు అని ఆయన అన్నారు. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని సిఎం అన్నారు. పట్టణాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లో గ్రామాల్లో అయితే ఫోన్ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్ వస్తుంది అని సిఎం అన్నారు. ప్రతీ పేదవాడికి కూడా నాణ్యమైన వైద్యం అందాలని అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: