ఒడిశాలో కరోనా అదుపులోకి వచ్చినట్టే వచ్చి భారీగా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. వందల కేసులు నమోదు కావడంతో ఇప్పుడు పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. అక్కడ వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువ. ఆస్పత్రికి వెళ్ళాలి అంటే  పదుల కిలోమీటర్లు కాలి నడకన వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. 

 

ఇప్పుడు అక్కడ కరోనా కేసులు ఈ విధంగా పెరగడంతో సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. జూన్ 30 (నిన్న) ఒడిశాలో 251 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 243 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5,189 మంది ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నారు. ఆ రాష్ట్రంలో 2,094 క్రియాశీల కేసులు ఉన్నాయి అని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,316 కి చేరుకుంది అని  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: