తమిళనాడులో దారుణం జరిగింది. తమిళనాడు నైవేలి లిగ్నైట్ కార్పోరేషన్​లోని ఎన్‌ఎల్‌సీ యూనిట్‌-2లో బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు  ప్రాణాలు కోల్పోయారు. 17 మందికి గాయాలయ్యాయి. ఈ మద్య లాక్ డౌన్ ఎత్తివేస్తున్నప్పటి నుంచి పలు కంపెనీల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మద్య వైజాగ్ తర్వాత గుజరాత్ మరికొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రసాయినక కంపెనీలో ప్రాథమిక సూత్రాలు పాటించకుండా వ్యవహరించడం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు.

 

కనీసం సెక్యూరిటీ లేని కొన్ని కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంటున్నారు.  ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటాన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం ఎన్‌ఎల్సీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: