ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే ఒకేసారి 1088 108,104 సర్వీసులను ప్రారంభించడంపై ఇప్పుడు పలువురు ప్రముఖులు ఏపీ సర్కార్ ని కొనియాడుతున్నారు. ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం నిజం గా సంచలనం అని వైద్య రంగంలోనే ఇదో గొప్ప పరిణామం అంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు.
సిఎం జగన్ ని పలువురు సినీ రాజకీయ మీడియా ప్రముఖులు కొనియాడుతున్నారు. ట్విట్టర్ వేదికగా సిఎం చేసిన ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ తెలుగు దర్శకుడు కోనా వెంకట్ ట్విట్టర్ లో సిఎం జగన్ చేసిన ఒక ట్వీట్ ని రీ ట్వీట్ చేసారు. వైద్య ఆరోగ్యంపై ఒక గొప్ప అడుగు అంటూ ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.
A great initiative towards healt care sir @ysjagan 🙏 https://t.co/qgHH14OoCi
— kona venkat (@konavenkat99) July 1, 2020