జూన్ 30 నాటికి దేశ రాజధాని ఢిల్లీలో లక్ష కేసులు ఉంటాయని, అందులో 60,000 యాక్టివ్ కేసులు ఉంటాయని అంచనా వేశామని కాని ఈ రోజు మన దగ్గర 26,000 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి ఆ రాష్ట్ర సిఎం అరవింద్ కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. ఇది ప్రతి ఒక్కరి కృషి ఫలితమే అని ఆయన అన్నారు. తాము పరిస్థితిని అదుపు చేసామని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 

 

గత కొన్ని రోజులుగా దేశ రాజధాని పరిస్థితి మెరుగుపడుతుంది అని ఆయన అన్నారు. అయితే, అది ఆత్మ సంతృప్తి ఇవ్వడం లేదని ఈ వైరస్ అంచనా వేయలేనిది అని ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మరింత శక్తివంతంగా పోరాటం చెయ్యాలని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: