వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ తాజాగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జూన్ నెల 19వ తేదీన జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సభ్యుడిగా ఎన్నిక కావడంతో ఆయన మండలి సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది కాలంలో తాను ఎంతో సంతృప్తితో పని చేసినట్లు తెలిపారు. తన శాఖ విషయంలో సీఎం ఎటువంటి జోక్యం చేసుకోలేదని అన్నారు. 
 
కౌన్సిల్ రద్దు అయ్యేంతవరకూ మంత్రిగా కొనసాగినా అభ్యంతరం లేదని సీఎం తనకు చెప్పారని వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వెళ్లాలన్నది తన చిరకాల కోరిక అని చెప్పారు. ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకహోదా కోసం సీఎం జగన్ సుదీర్ఘ పోరాటం చేశారని అది సాధ్యం కాదని తాను అనుకుంటున్నానని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: