ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 9.30 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్‌ సర్కిల్‌లో 108, 104 వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒకేసారి ఏకంగా 1,088 వాహనాల సర్వీసులు రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అనారోగ్యం లేదా ప్రమాదానికి గురైన వారిని వెంటనే అత్యాధునిక వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో ఈ వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 
 
అయితే వాహనాలను ప్రారంభించిన తొలిరోజే జగన్ కు దెబ్బడిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈరోజు ప్రారంభించిన వాహనాల ముందుభాగం, వెనుక భాగం నుజ్జునుజ్జయినట్లు కనిపిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు విజయవాడలోని కొత్తగా ఓపెన్ చేసిన ఆంబులెన్స్ ఫోటోలు అని సమాచారం. మరోవైపు 108, 104 కొత్త వాహనాలను ప్రారంభించినా వీటి నిర్వహణ అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అనేక కంపెనీలు వీటి బాధ్యతలను తీసుకుని సరిగ్గా నిర్వహించలేక విఫలమయ్యాయి. ప్రభుత్వం ఈ వాహనాల కోసం కొంత రిజర్వ్ ఫండ్ కేటాయిస్తే సమస్యను అధిగమించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: