తెలంగాణాలో కరోనా కట్టడి విషయంలో అధికార తెరాస, బిజెపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అక్కడి బిజెపి తెలంగాణా ప్రభుత్వాన్ని పదే పదే టార్గెట్ చేస్తూ వస్తుంది. తాజాగా మరోసారి బిజెపి టార్గెట్ చేసింది. తెలంగాణాలో కరోనా పరిక్షలు 11 వేలు చేస్తున్నామని చెప్పినా సరే ఆ స్థాయిలో జరగడం లేదు అని కేవలం 3 వేల పరిక్షలు మాత్రమే చేస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ఆరోపించారు. 

 

తెలంగాణా కరోనాను చాలా లైట్ తీసుకుంటుంది అని ఆయన మండిపడ్డారు. తెలంగాణాలో కరోనా కేసులు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. తెలంగాణా సర్కార్ అంకెల గారడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మరి దీనిపై అధికార పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: