మధ్యప్రదేశ్‌ రాష్ట్ర కేబినెట్‌ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఈ విషయమై పార్టీ ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌. మూడు నెలల క్రితమే సీఎంగా బాధ్యతలు చేపట్టినా.. కేవలం ఐదుగురికి మాత్రమే మంత్రులుగా అవకాశం కల్పించారు. కానీ ఈ సారి 20 మందికి పైగా ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశాలున్నాయని సమాచారం.

 

 

వీరిలో ఎక్కువగా కాంగ్రెస్‌ నుంచి జ్యోతిరాధిత్య సింధియాతో పాటుగా భాజపాలో చేరిన వారికి అవకాశం కల్పించే వీలున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గ విస్తరణపై భాజపా అధినాయకత్వంతో సంప్రదింపులు జరిపేందుకు ఢిల్లీకి వెళ్లొచ్చారు చౌహన్‌.

 

 

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా ఉన్న లాల్‌జీ టాండన్‌ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినందున ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేస్తున్న ఆనందిబెన్‌ పటేల్‌.. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: