రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్​ పుతిన్​ 2036 వరకు కొనసాగడానికి ఆ దేశ ప్రజలు ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణకు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగ్​లో 73శాతం మంది అనుకూలంగా ఓటు వేసినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం వెల్లడించింది.

 

 

దేశాధ్యక్ష పీఠంపై ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ 2036 వరకు కొనసాగేందుకు వీలు కల్పించే రాజ్యాంగ సంస్కరణలను రష్యా ప్రజలు ఆమోదించారు. ఈ మార్పులపై ప్రజాభిప్రాయ సేకరణకుగాను వారంరోజుల పాటు నిర్వహించిన ఎన్నికలు బుధవారంతో ముగిశాయి.

 

ఈ ఓటింగ్​లో 63శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 73శాతం ఓటర్లు తాజా సంస్కరణలకు అనుకూలంగా ఓటేసినట్లు ప్రాథమిక ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని రష్యా కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: