మహారాష్ట్రలో కరోనా కేసుల విషయంలో ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్న అక్కడి సర్కార్ లాక్ డౌన్ ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ లాక్ డౌన్ నిర్ణయాన్ని మిత్ర పక్షాలు అయిన ఎన్సీపీకి గాని కాంగ్రెస్ కి గాని చెప్పలేదు అని  వాళ్ళ అభిప్రాయం తీసుకోలేదు అని తెలుస్తుంది. దీనితో అఘాది ప్రభుత్వంలో ఇప్పుడు విభేదాలు తలెత్తాయి అనే వార్తలు వస్తున్నాయి. 

 

ఆ రెండు పార్టీలకు కేవలం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని లాక్ డౌన్ పై  ప్రకటన చేసిన తర్వాత మాత్రమే తెలిసింది అని అంటున్నారు.  ఇప్పుడు ఇది జాతీయ మీడియాలో హైలెట్ అయింది. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి. కాగా మహారాష్ట్రలో కరోనా కేసులు రెండు లక్షల దిశగా వెళ్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: