భార‌త‌దేశంలోనే క‌రోనా వ్యాప్తి ఎక్కువుగా ఉన్న రాష్ట్రాల‌లో తెలంగాణ ఒక‌టి. ఇక్క‌డ సామాజిక వ్యాప్తి ద్వారా క‌రోనా ఏకంగా 122 శాతం వ్యాప్తి చెందుతోంద‌ట‌. ఇక నిన్న‌టి వ‌ర‌కు ఒక రేంజ్‌లో ఉన్న క‌రోనా ఇప్పుడు గేర్ మార్చింది. ఇప్పుడు రోజుక ఒక్క హైద‌రాబాద్ న‌గ‌రంలోనే ఏకంగా వెయ్యికి పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి. గ్రేట‌ర్‌లో క‌రోనా తీవ్ర‌త రోజు రోజుకు రెట్టింపు అవుతోంది. జూన్లోనే తీవ్రంగా ఉన్న క‌రోనా జూలైలో మ‌రింత తీవ్ర‌మ‌వుతోంద‌ట‌. ఈ నెల‌లో తొలి రోజే ఏకంగా రికార్డుస్థాయిలో 881 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆర్యోగ శాఖ అధికారులు ప్రకటించారు. 

 

ఇప్పుడు వైర‌స్ న‌గ‌రం న‌లుమూల‌లా విస్త‌రిస్తోంది. గ్రేటర్‌లో మార్చిలో తొలి కరోనా కేసు నమోదు అయింది. మే చివరి వరకు కూడా పదులు, వందల్లోనే పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత కరోనా పంజా విసిరింది. ఒక‌ప్పుడు రాష్ట్రం అంత‌టా 50 కేసులు న‌మోదు అయితే ఇప్పుడు అవి ఏకంగా వెయ్యికి చేరువ అవుతున్నాయి. అందులో 90 శాతం కేసులు నగరానివే ఉంటున్నాయి. జూన్‌ మొత్తంగా 11.080మందికి కరోనా వైరస్‌ సోకినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక  ఈ జోరు చూస్తుంటే గ్రేట‌ర్ మ‌హాన‌గ‌రం క్ర‌మ‌క్ర‌మంగా క‌రోనా గుప్పిట్లోకి వెళ్లిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: