ఓ వైపు క‌రోనా ఇంత‌లా రెచ్చిపోతుంటే క్రికెట్ ప్రియులు మాత్రం ఐపీఎల్ క్యాన్సిల్ అవుతుంద‌న్న ఆందోళ‌న‌తో ఉన్నారు. ఈ యేడాది ఐపీఎల్ ర‌ద్దు అయితే ఏకంగా 5 వేల కోట్ల‌కుపైగా అధికారికంగా న‌ష్ట‌పోవాల్సి ఉంటుంది. ఇక అన‌ధికారిక లెక్క‌ల ప్ర‌కారం ఎన్ని కోట్లు ఎంత మంది న‌ష్ట‌పోతారో ఊహ‌ల‌కే అంద‌డం లేదు. ఈ క్ర‌మంలోనే క‌రోనా ఉన్నా కూడా క్రికెట్ ప్రియులు మాత్రం ఐపీఎల్ జ‌రుగుతుంద‌న్న ఆశ‌ల‌తో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్‌పై ఓ గుడ్ న్యూస్ వ‌చ్చింది.

 

ఈ యేడాది ఐపీఎల్‌ను ప‌రిమిత మ్యాచ్‌ల‌తో నిర్వ‌హించాల‌ని... అది కూడా మ్యాచ్‌లు అన్ని ఒక్క ముంబైలో మాత్ర‌మే నిర్వ‌హించాల‌ని కొందరు బీసీసీఐ సీనియర్‌ అధికారులు జీసీ వర్గాలకు సూచించార‌ట‌. ముంబైలో మూడు అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాలున్నాయి. వాంఖెడే, బ్రబౌర్న్, డీవై పాటిల్‌ స్టేడియాలున్నాయి. దీంతోపాటు రిలయెన్స్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌కు కూడా ప్రత్యేకించి మైదానం ఉంది. అక్క‌డ స్టార్ హోట‌ల్స్‌కుక కొద‌వే లేదు. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో క‌రోనా క‌ల్లోలంగా ఉంది. అక్టోబ‌ర్‌కు అక్క‌డ ప‌రిస్థితి సాధార‌ణంగా ఉంటేనే ఈ టోర్న‌మెంట్ నిర్వ‌హించే ఆలోచ‌న ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: