క‌రోనా మ‌హ‌మ్మారి చివ‌ర‌కు క్రీడ‌ల‌కు కూడా తాకింది. ఈ క్ర‌మంలోనే క్రికెట్ నుంచి అన్ని క్రీడా టోర్న‌మెంట్లు గ‌త నాలుగు నెల‌లుగా ర‌ద్ద‌యిన సంగ‌తి తెలిసిందే. చివ‌ర‌కు టీ 20 ప్ర‌పంచ్ క‌ప్ కూడా ఇప్ప‌ట్లో నిర్వ‌హించ‌లేమ‌ని క్రికెట్ ఆస్ట్రేలియా చేతులు ఎత్తేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏ క్రీడ కూడా ఎవ్వ‌రూ ఆడ‌డం లేదు. అయితే ప్రేక్ష‌కులు లేకుండా గేమ్ ఆడాల‌న్న నిబంధ‌న‌లు ఇప్పుడిప్పుడే తీసుకు వ‌స్తున్నారు. ఇక ఇప్పుడు నాలుగు నెల‌ల గ్యాప్ త‌ర్వాత దక్షిణాఫ్రికాలో క్రికెట్‌ పునః ప్రారంభం కానుంది. 

 

ఈనెల 18 నుంచి జరుగనున్న 3 టీ క్రికెట్ టోర్న‌మెంట్‌తో ఇప్పుడు అక్క‌డ క్రికెట్ మ్యాచ్‌లు మ‌ళ్లీ ప్రారంభం కానున్నాయి. దీంతో అక్క‌డ క్రికెట్ ప్రియులు అంద‌రూ మా అగ్రశ్రేణి క్రీడాకారులను మళ్లీ టీవీల్లో చూడబోతున్నాం అని సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈ టోర్న‌మెంట్ ద్వారా వ‌చ్చే ఆదాయాన్ని కోవిడ్ క‌ష్టాలు ప‌డుతోన్న బాధితుల‌కు ఇవ్వ‌నున్నారు. ఇందులో ద‌క్షిణాఫ్రికా టాప్ క్రికెట‌ర్లు మూడు జ‌ట్లుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: